టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత బాలీవుడ్ డిబట్ ఎంట్రీ పై ఎప్పటినుండో హాట్ హాట్ వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప ఐటెం సాంగ్ సమంతకు ఉత్తరాదిన సూపర్ స్టార్డం తీసుకొచ్చాయి. దీంతో ఆమె ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుందా అని అటు నార్త్ ఆడియన్స్ ఇటు సమంత సౌత్ అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి టాప్ హీరోల పక్కన మంచి కమర్షియల్ సినిమాలలో, బిగ్ ప్రొడక్షన్ హౌస్ లలో సమంత నటిస్తుందనుకున్నారంతా. కానీ, వారందరి అంచనాలకు విభిన్నంగా, సమంత హీరోయిన్ తాప్సి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోతున్న ఒక చిత్రంతో బాలీవుడ్ డిబట్ ఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయుష్మాన్ సినిమాలు సోషల్ మెస్సేజెస్ మరియు పక్కా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు. వాటిలో హీరోయిన్ రోల్స్ కు ముఖ్య పాత్ర ఉంటుంది. కానీ, కమర్షియల్ సినిమాలైతే కాదు. సౌత్ లో పక్కా కమర్షియల్ సినిమాలలో నటించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్న సమంత బాలీవుడ్ లో మాత్రం ఆఫ్ బీట్ సినిమాలను ఎంచుకోవడం పట్ల ఆమె అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.