ఇండియన్ బెస్ట్ వర్సటైల్ యాక్టర్స్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒకరు. అవకాశం వచ్చినప్పుడు హీరోగా, లేకపోతే, విలన్ అండ్ సపోర్టింగ్ రోల్స్ పోషిస్తూ తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సినిమా సినిమాకు తన స్టార్డం ను, క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్ లలో ఇప్పటికే విజయ్ సేతుపతి హవా సాగుతుంది. తాజాగా బాలీవుడ్ రంగప్రవేశం చెయ్యబోతున్నారు విజయ్. అదికూడా ఒకేసారి హీరోగా, మరియు విలన్గా.
శ్రీరామ్ రాఘవన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న "మెర్రీ క్రిస్మస్" చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ - షారుఖ్ ఖాన్ కాంబోలో "జవాన్" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్ ను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్రలో విజయ్ నటించబోతున్నాడని బాలీవుడ్, కోలీవుడ్ మీడియాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఈ సినిమాలో విజయ్ విలన్గా నటించడం నూరుశాతం ఖచ్చితమే అని అంటున్నారు.
రెండు విభిన్న సినిమాలలో, రెండు విభిన్న పాత్రలతో విజయ్ సేతుపతి బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండడం పట్ల ఆయన అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు.