మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా, షాజీ కైలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "కడువా". ఈ చిత్రంలో సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా కడువా మూవీకి సంబంధించి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తైనట్టు తెలుస్తుంది. 2గంటల 34 నిమిషాల నిడివితో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం "యూ/ఏ" సర్టిఫికెట్ పొందింది. పాన్ ఇండియా భాషల్లో జూలై 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం జూలై 7వ తేదికి వాయిదా పడింది.