మెగాపవర్ స్టార్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని సినిమాలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే వేగంతో RC 15 షూటింగ్ పూర్తైతే, ఆ వెంటనే చరణ్ తన పదహారవ సినిమాను స్టార్ట్ చెయ్యనున్నాడని టాక్.
కొంచెం కూడా టైం వేస్ట్ చెయ్యకుండా శంకర్ RC 15 మూవీ షూటింగ్ ను జరుపుతున్నాడు. ఇలా ఐతే, ఈ ఏడాది నవంబర్ కల్లా ఈ మూవీ షూటింగ్ ముగుస్తుందని టాక్. ఆ తర్వాత చరణ్ కూడా ఆలస్యం చెయ్యకుండా డిసెంబర్ నుండి RC 16సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చరణ్ తన 16వ సినిమాను చెయ్యనున్న విషయం తెలిసిందే. ఐతే, గౌతమ్ హిందీలో తెరకెక్కించిన జెర్సీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగలడంతో రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై క్లారిటీ రావాలన్నా నవంబర్ వరకు ఆగాల్సిందే.