ప్రముఖ కథా రచయిత, రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత దేశపు అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ విజయేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో రచనలు చేశారని మోదీ కొనియాడారు.ఈ సందర్భంగా రాజ్యసభకు నామినేట్ అయినందుకు ప్రధాని ఆయనకు అభినందనలు తెలిపారు.