ఇండియన్ వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ లలో ఒకటైన యూట్యూబ్ లో 'బుల్లెట్' పాట అరుదైన రికార్డును నమోదు చేసింది. కనీవిని ఎరుగని విధంగా 150 మిలియన్లకు పైగా వీక్షణలతో, 1.53 మిలియన్ లైక్స్ తో సౌత్ ఇండియన్ సెన్సేషనల్ సాంగ్ గా బుల్లెట్ పాట నిలిచింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది.
కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ కృతిశెట్టి లపై చిత్రీకరింపబడిన ఈ పాట రెండ్నెల్ల క్రితం యూట్యూబులో విడుదలైంది. అప్పటి నుండి మిలియన్ల కొద్దీ వీక్షణలను రాబడుతూ, యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ లో ఒకటిగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను కోలీవుడ్ హీరో శింబు ఆలపించడం విశేషం.