రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ది వారియర్". ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు మరియు పాటలకు ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ చిత్రం నుంచి విడుదలైన బుల్లెట్ సాంగ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల ఈ పాట 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దీనికి 1.53 మిలియన్ లైక్స్ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు.