లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం విక్రమ్. తన సొంత బ్యానరైన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో భారీ బడ్జెట్ తో కమల్ నిర్మించిన ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదలై రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 450కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, థియేటర్లలో రద్దీ ఇంకా తగ్గకుండానే, డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. నిన్న అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విక్రమ్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ అలాగే హీరో సూర్య కీలక పాత్రల్లో నటించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ అయిన విక్రమ్ డిజిటల్ లో ఇంకెలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa