ఒక హీరోయిన్ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో ఒక రేంజులో వార్తలు వస్తున్నాయి. పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఆమెనే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు కేవలం ఆ హీరోయిన్ PR టీం గిమ్మిక్కులే అని క్లియర్ గా తెలుస్తుంది.
బాలీవుడ్ లో ఆ హీరోయిన్ నటిస్తుందని ప్రచారంలో ఉన్న ప్రాజెక్టులు కేవలం చర్చల దశలోనే ఉన్నాయి. కానీ, ఆమె PR టీం మాత్రం ఒకడుగు ముందుకేసి, ఆమెపై వరస కథనాలను ప్రచారం చేసి, బాలీవుడ్లో ఆమెకు ఫుల్ డిమాండ్ ఉందనే ఇంప్రెషన్ ను క్రియేట్ చేస్తున్నారు.
పర్సనల్ లైఫ్ లో కొన్ని ఒడిదుడుకుల తర్వాత తిరిగి ఒంటరి జీవితం ప్రారంభించిన ఆ హీరోయిన్ తనను తాను సెల్ఫ్ ప్రోమోట్ చేసుకుంటూ, కెరీర్ లో మళ్ళీ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం తెలుగులో రెండు, మూడు సినిమాలు చేస్తున్న ఆమె సినీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.