ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్ (82) బుధవారం రాత్రి మృతి చెందారు. 'ది గాడ్ ఫాదర్' సినిమాతో ఆయనకు బాగా పేరొచ్చింది. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో 1940లో జన్మించిన కాన్ హాలీవుడ్‌లో 60 ఏళ్లకు పైగా పనిచేశారు. ది గ్యాంబ్లర్, రోలర్ బాల్, తీఫ్, మిజరీ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. పలు టీవీ షోలలోనూ ఆయన మరుపురాని పాత్రలను పోషించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.