ఆర్ ఆర్ ఆర్ కు ముందు వరకు ఒక్క సౌత్ ఇండస్ట్రీ కే పరిమితమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా కౌశల్యం, ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత భారతదేశం మొత్తానికి వ్యాప్తి చెందింది. ఒక్క సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ లుగా తమ స్టార్డం ను పెంచుకున్నారు.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో "ఎన్టీఆర్30" వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వగా, దానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన దక్కింది. దానితో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తైన వెంటనే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు, చిత్రబృందానికి ఒక వింత సమస్య ఎదురైంది. అదేనండి... ఈ మూవీ లో హీరోయిన్ విషయమై. మేకర్స్ తలలు పట్టుకుంటున్నారట.
ఇప్పటికే ఈ మూవీ నుండి బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ ఆలియాభట్ తప్పుకుందని ప్రచారం జరుగుతుంది. దీపికా పదుకొణె, సమంత లపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్రబృంద సన్నిహిత వర్గ సమాచారం. వారి సమాచారం మేరకు, ఈ మూవీలో తారక్ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో దర్శక నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారంట. పాన్ ఇండియా సినిమా కాబట్టి అంతటి ఫేమ్ ఉన్న హీరోయిన్ కావాలని కొరటాల పట్టుబట్టుకుని కుర్చున్నాడట. మరి, హీరోయిన్ గా ఈ సినిమాలో ఎవరు సెలెక్ట్ అవుతారన్న విషయంపై క్లారిటీ రావాలంటే, చిత్రబృందం అధికారికంగా ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.