నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లో తొలిసారి నటిస్తున్న చారిత్రక నేపధ్య చిత్రం "బింబిసార". మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చెయ్యగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది. దీంతో బింబిసార థియేట్రికల్ హక్కులు భారీ ధర పలుకుతున్నాయట.
బింబిసార ఆంధ్రప్రదేశ్, తెలంగాణా హక్కులు రూ. 15 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. కళ్యాణ్ గత చిత్రాలు 8-10 కోట్ల రేంజులో అమ్ముడవ్వగా, బింబిసార 15 కోట్లకు అమ్ముడవ్వడం, సినిమాపై ప్రేక్షకులకున్న క్రేజ్ కు ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్యాథెరిన్ థెరెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న, థియేటర్లలో విడుదల కాబోతుంది.
![]() |
![]() |