లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో మరియు యూట్యూబ్‌లో కూడా విడుదల చేసినట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాలో మొత్తం 21 ట్రాక్‌లను విడుదల చేశారు. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.