టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, 'RX100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం "తీస్మార్ ఖాన్". కళ్యాన్జీ గోగన డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ కొంచెంసేపటి క్రితమే బిగ్ అప్డేట్ ను ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుందని పేర్కొంటూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇటీవల విడుదలైన టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు నమోదవగా, ఈ సినిమాతోనైనా ఆది విజయాల బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |