మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్" పై భారీ హైప్స్ క్రియేట్ చేసే క్రమంలో, మేకర్స్ ఏకంగా కమల్ హాసన్ ను రంగంలోకి దింపుతున్నారని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. భారీ బడ్జెట్ తో, భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల్లో అంచనాలు నమోదు అవలేదు. దీంతో మేకర్స్, విక్రమ్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన కమల్ హాసన్ ను అప్రోచ్ అయ్యారంట. ఈ సినిమాలో కథను నేరేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ను కమల్ తో చెప్పించబోతున్నారని టాక్ నడుస్తుంది. ఐతే, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, 'జయం' రవి, త్రిష ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మణిరత్నం ఈ సినిమాను నిర్మించారు.
![]() |
![]() |