అతడు, ఖలేజా తరవాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న SSMB 28 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని అభిమానులు వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే స్క్రిప్ట్ ఫైనలైజేషన్ కావడంతో, మూవీ టీం ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టేసింది. మరోపక్క తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ ను కానిచ్చేస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ మ్యూజిక్ పనులపై తమన్ అప్డేట్ ఇచ్చాడు. తెల్లవారుఝామున కూడా ఈ మూవీ మ్యూజిక్ కోసం తమన్ తెగ కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఈ మేరకు తమన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక పిక్ ను షేర్ చేసాడు. అందులో ఎర్లీ మార్నింగ్ వర్క్...#SSMB 28 అని కామెంట్ చేసాడు. శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండడంతో, వచ్చే నెల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
![]() |
![]() |