ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా 154 టీంతో జాయిన్ ఐన 'మెగా మగువ' ...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 10:48 AM

మెగాస్టార్ చిరంజీవి, కే ఎస్ రవీంద్ర కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ లాక్ చెయ్యని ఈ మూవీ చిరుకు 154వ సినిమా కావడంతో మెగా #154 గా పిలుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈరోజు నుండి స్టార్ట్ అవ్వబోతున్న కొత్త షెడ్యూల్ లో హీరోయిన్ శ్రుతిహాసన్ జాయిన్ అవ్వబోతున్నారంట. మెగాస్టార్, శ్రుతి లపై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. పోతే... ఈ మూవీకి "వాల్తేరు వీరాయ్య" అనే టైటిల్ ప్రచారంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa