సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగానే తాను నటించిన 'థాకడ్' చిత్రానికి పరాజయం వచ్చిందని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పేర్కొంది. తాజాగా దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. నిర్మాత దీపక్ సినిమా ఫలితంపై సంతృప్తిగానే ఉన్నారని, ఆస్తులు అమ్ముకున్నారనే వార్తల్లో నిజం లేదని పేర్కొంది. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రూ.80 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.4 కోట్ల వసూళ్లు మాత్రమే దక్కాయి.