హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం "సీతారామం". ఇందులో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న అక్కినేని హీరో సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. "బ్రిగేడియర్ విష్ణు శర్మ" పాత్రలో సుమంత్ ఈ సినిమాలో నటిస్తున్నారని పోస్టర్ ను బట్టి తెలుస్తుంది. ఈ పోస్టర్లో సుమంత్ లుక్ చాలా ఇంటెన్స్ గా, ఇంట్రెస్టింగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుంది.