తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’ తెలుగు, తమిళ భాషల్లో జులై 14న విడుదల కాబోతుంది. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. మొన్న వారియర్ తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో భారీగా జరిపారు. ఇక తెలుగులోను వారియర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10న సా.6 గంటలకు జేఆర్సి కన్వెన్షన్‌లో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు.