అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మరోసారి దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేశ్ బాబు కాంబినేషన్ లో మరో మూవీ రానుంది. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి హ్యట్రిక్‌కు రెడీ అవుతున్నారు.ఫిబ్రవరిలో లాంచింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలుకానుంది.ఇటీవలే త్రివిక్రమ్, మహేష్‌కు ఫుల్ స్క్రిప్ట్‌ను వినిపించారట.కాగా ఈరోజు మేకర్స్ ఈ సినిమా పై క్లారిటీ ఇస్తూ అప్డేట్ విడుదల చేశారు.