MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాలోని "రా రా రెడ్డి ...ఐయామ్ రెడీ " అనే మాస్ మసాలా పాటను ఈరోజు సాయంత్రం శ్రీకాకుళంలో విడుదల చేయాలి. శ్రీకాకుళంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ జరగాల్సిన ఈవెంట్ ను హైదరాబాద్ లోని AMB సినిమాస్ స్క్రీన్ 2లో నిర్విహిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.