ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ పిక్: నయన్ పెళ్ళిలో సూపర్ స్టార్ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 03:46 PM

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 9వ తేదీన ఆరేళ్లుగా ప్రేమిస్తున్న కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడిచింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ అతిరథమహారధులందరూ హాజరై నయనతార, విఘ్నేష్ లను ఆశీర్వదించారు.
తాజాగా వీరి పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నయనతార దంపతులకు సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ మణిరత్నం గిఫ్ట్ నిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ పక్కనే బాలీవుడ్ బాద్షా కూడా నవ్వుతూ నిల్చుని కనిపిస్తారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నయనతారను సూపర్ స్టార్ ఆత్మీయంగా పలకరిస్తున్న ఈ ఫోటో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa