కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తి టాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది సంచలన నటి శ్రీరెడ్డి. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడి, కొందరు సినీ పెద్దల పేర్లు కూడా వెల్లడించింది. తనను అవకాశాల పేరుతో లైంగిక వాడుకున్నారని ఆరోపించింది. ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖుల మీద కూడా ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి వ్యవహారంపై యాంకర్, నటి రేష్మి స్పందించింది. రేష్మి తాజాగా `అంతకు మించి` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
`నేను సినీ పరిశ్రమలో ఎలాంటి వేధింపులనూ ఎదుర్కోలేదు. శ్రీరెడ్డిలాంటి వారికి అలాంటి అనుభవం ఎదురై ఉండవచ్చు. అయితే మనకి నచ్చకపోతే `నో` చెబితే సరిపోతుంది. ఎవరూ మనల్ని బలవంత పెట్టరు, రేప్ చెయ్యరు. ఇక్కడ రెండు చాయిస్‌లు ఉంటాయి. కష్టపడి పైకి ఎదగాలనుకోవడం లేదా కాస్టింగ్ కౌచ్‌కు అనుకూలంగా ఉండి అవకాశాలు సంపాదించుకోవడం. ఏది ఎంచుకోవాలనేది మన చాయిస్. ఇద్దరికీ నచ్చితేనే కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతుంది. అయినా కష్టపడి సినిమాలు తీసే నిర్మాతలెవరూ ఇలాంటి పనులు చేస్తారనుకోను. ఎందుకంటే వారికి బోలెడు టెన్షన్లు ఉంటాయి` అని రెష్మి చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa