ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా, కోలీవుడ్ దర్శకుడు ఎన్. లింగుసామి డైరెక్షన్లో రూపొందిన చిత్రం "ది వారియర్". ఇందులో కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో జరగ్గా, దర్శకుడు లింగుసామి మాట్లాడుతూ... ఈ సినిమాకు సీక్వెల్ ఉండే అవకాశాలున్నాయని చూచాయగా చెప్పారు. ఈ విషయంపై ఇంకెలాంటి ఇన్ఫర్మషన్ ను ఆయన రివీల్ చెయ్యలేదు. ప్రపంచవ్యాప్తంగా జూలై 14వ తేదీన విడుదలవబోతున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉందని తెలిసి రామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa