ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా 154 : రవితేజ రోల్ షూటింగ్ పై సూపర్ అప్డేట్?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 10:36 AM

వెంకీ మామ తరువాత, దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్నది) టైటిల్ తో పక్కా యాక్షన్ కమర్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. జూలై 13 నుండి జరగబోయే షూటింగ్ షెడ్యూల్ లో రవితేజపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. అలానే, జూలై 18 నుండి మెగాస్టార్ చిరంజీవిపై ఒక మాస్ సాంగ్ షూటింగ్ ను చెయ్యనున్నారట. ఐతే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa