నాచురల్ స్టార్ నాని, నజ్రియా నాజిమ్ జంటగా నటించిన చిత్రం "అంటే సుందరానికి". వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తో రన్ అయ్యింది. గతవారం నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నా కూడా ఈ సినిమాను పొగిడేస్తూ, తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టోరీని షేర్ చేసింది. ఈ సినిమా ఒక జెమ్ అని, దర్శకుడు వివేక్ ఇలాంటి కథను ఎంచుకుని సినిమాగా తీయడం నిజంగా గ్రేట్ అని పేర్కొంటూ, చిత్రబృందం మొత్తానికి శుభాకాంక్షలను తెలియచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa