టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో "ది వారియర్" సినిమా తెరకెక్కుతుంది. జూలై 14న విడుదలవబోతున్న ఈ చిత్రం తదుపరి టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బోయపాటి శీనుతో రామ్ తదుపరి సినిమాను చేయనున్నాడు. వీరి కాంబోలో రూపొందే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ప్రచారం జరుగుతుంది. ఐతే, దీనిపై మూవీ టీం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఇదిలావుండగా, తాజాగా ఈ సినిమాపై మరొక ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అదేంటంటే, పాన్ ఇండియా లెవెల్లో వంద కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. మరి దీనిపై మరింత క్లారిటీ రావలసి ఉంది.