బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'తన పెళ్లిపై తన పేరెంట్స్ కంటే మీడియా, పబ్లిక్ కే ఎక్కువ ఇంట్రెస్ట్' అని ఘాటుగా స్పందించింది. తన తల్లిదండ్రులు కూడా పెళ్లి గురించి అంతగా అడగరని ఆమె చెప్పుకొచ్చింది. తన జీవితాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని, అంత వరకు పెళ్లి చేసుకోను అని సోనాక్షి సిన్హా స్పష్టం చేసింది.