టాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం "కార్తికేయ 2". చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మిస్టరీ ఫాంటసీ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆగస్టు మొదటి వారానికి సినిమాను వాయిదా వేస్తున్నట్టు హీరో నిఖిల్ ట్వీట్ చేసాడు. ఈ సందర్భంగా కార్తికేయ 2 ప్రీమియర్ షో టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు సారీ చెప్తూ, టికెట్ డబ్బులు రీఫండ్ చేయబడతాయని తెలిపాడు.
![]() |
![]() |