"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" గా ప్రేక్షకులను పలకరించి సూపర్ హిట్ కొట్టాడు అక్కినేని హీరో అఖిల్. తదుపరి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో "ఏజెంట్" అవతారమెత్తనున్నాడు. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ తెరకెక్కించి టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో అఖిల్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
కానీ, ఈ మూవీపై ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే.., ఈ మూవీ టైటిల్ గా పవన్ కళ్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ సినిమా "తమ్ముడు" టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఈ సినిమాను టాలీవుడ్ సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. త్వరలోనే, ఈ మూవీ అధికారిక ప్రకటన జరగబోతుందట.