కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారి నటిస్తున్న హాలీవుడ్ చిత్రం "ది గ్రే మాన్". అవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ వంటి వరల్డ్ టాప్ క్లాస్ సినిమాలను తెరకెక్కించిన రస్సో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్రిస్ ఇవాన్స్, ర్యాన్ గోస్లింగ్, అనా డే ఆర్మాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన ఒక వీడియోను రస్సో బ్రదర్స్ ఈ రోజు ఉదయం విడుదల చేసారు. ర్యాన్ గోస్లింగ్, అనా డే ఆర్మాస్ లతో తలపడుతున్న ధనుష్ యాక్షన్ పెరఫార్మన్స్ చాలా ఇంటెన్స్ గా, ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే విధముగా ఉంది. ఇంగ్లిష్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తమిళం భాషలలో జూలై 15 నుండి సెలెక్టెడ్ ధియేటర్స్ లో , జూలై 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.