వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్టీయార్, రామ్‌చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది.
ప్రస్తుతం కొత్త భామల రాకతో రకుల్‌కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన కెరీర్ గురించి మాట్లాడింది. `వాస్తవాన్ని అంగీకరించగలిగినపుడు ఎలాంటి భయాలూ ఉండవు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజున్న ఫేమ్ రేపు ఉండకపోవచ్చు. ప్రేక్షకులకు నేను బోర్ కొట్టినపుడు నా అంతట నేనే పరిశ్రమకు దూరమైపోతా. పరుగు ఎప్పుడు ఆపాలో తెలుసు` అని రకుల్ వ్యాఖ్యానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa