మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకలు నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ మెహర్ రమేష్ కలిసి మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా బిగ్ పార్టీని ఎరేంజ్ చేసారు.
ఈ పార్టీలో కంత్రి సినిమాలోని "123 నేనొక కంత్రి...నాకు నేనే రాజు మంత్రి.." అనే పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ పాటకు మెహర్ రమేష్ క్లాస్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 2007లో విడుదలైన ఈ చిత్రంలో తారక్, హన్సిక జంటగా నటించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్షన్ చెయ్యగా, మణిశర్మ సంగీతం అందించారు. విశేషమేంటంటే, ఈ పాటకు మెహర్ రమేష్ లిరిక్స్ అందించారు.