పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి తమిళ సూపర్ హిట్ "వినోదయ సిత్తం" రీమేక్ లో నటించబోతున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ సెట్స్ మీదున్న హరిహరవీరమల్లు సినిమాపై ప్రేక్షకులు ఎంత క్యూరియస్ గా ఉన్నారో ప్రచారంలో ఉన్న వినోదయ సిత్తం రీమేక్ పై అంతకన్నా ఆసక్తిని కలిగి ఉండటం విశేషం.
పోతే..., ఈ మూవీ ఇటీవలే సీక్రెట్ గా లాంఛ్ అయిపోయిందని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20రోజుల కాల్షీట్లను మాత్రమే ఇచ్చాడంట. సాయిధరమ్ తేజ్ మూడు నెలల భారీ కాల్షీట్లను కేటాయించాడని ఒక లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. తమిళంలో సూపర్ హిట్ ఐన చిత్రానికి సముద్రఖని డైరెక్షన్ చెయ్యగా, తెలుగులో కూడా ఆయనే దర్శకత్వం వహించబోతున్నారు. ఐతే, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.