ఎప్పుడూ ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించొద్దు. ఇండిగోని అవాయిడ్ చేయండి అంటోంది హీరోయిన్ ఈషారెబ్బ. ఈ అమ్మడు చాలా సార్లు ఈ ఫ్లైట్‌తో ఇబ్బంది పడిందట. ఇక విసుగొచ్చి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఓ నెటిజన్ ట్విటర్‌లో ఇండిగో ఫ్లైట్ కారణంగా తానుపడిన బాధను వెల్లడించాడు. దీనిపై ఈషారెబ్బ స్పందించింది.
‘‘ఇండిగో కారణంగా నేను ఫ్లైట్ మిస్ అవడం వారంలో ఇది రెండోసారి. ఇది జరిగింది రూల్స్ గురించి కాదు కానీ ఇండిగో ఉద్యోగుల ఈగో కారణంగా జరిగింది. వాళ్లు నన్ను ఒక్క నిమిషం ఆగమని.. 10నిమిషాల పాటు వెయిట్ చేయించారు. తిరిగి నన్నే నువ్వు 5 నిమిషాలు లేట్ అన్నారు. నేను వాళ్లను ప్రశ్నిస్తే అది మా రూల్ అన్నారు’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌ని చూసిన ఈషారెబ్బ ‘‘మీరు చెప్పింది నిజం. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌నే ఇండిగో కారణంగా చాలా సార్లు ఫేస్ చేశాను. దీంతో నేను ఇండిగో ఫ్లైట్‌లో ఎప్పుడూ ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నాను. వారి రూల్స్‌ని సెట్ చేసుకునే వారు ఎవరూ ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించవద్దని నేను ప్రతి ఒక్కరినీ అర్థిస్తున్నా’’ అని రీ ట్వీట్ చేసింది. దీనికి ‘నెవర్ ఫ్లై ఆన్ ఇండిగో, అవాయిడ్ ఇండిగో’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది ఈషా.
True what you said. I have faced same situation with @IndiGo6E many a times even I pledge I will never travel on Indigo and I I request everyone not to do so till they Set their rules right #NeverEverFlyOnIndigo #avoidindigo https://t.co/CpYwb4FPeG
— Eesha Rebba (@YoursEesha) September 4, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa