మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తొలిసారి కలిసి పని చేస్తున్న చిత్రం "గాడ్ ఫాదర్". సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ ను ముగించుకున్న ఈ చిత్రం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించడం విశేషం.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జూలై 28 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుందంట. అదికూడా ఇక్కడ కాదు ముంబైలో. నయన్, సల్మాన్, చిరులపై మేజర్ ఇంపార్టెంట్ సీన్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారట. ఆగస్టు 4 వరకు ముంబైలోనే ఈ షెడ్యూల్ జరగనుందట. ఆపై తిరిగి హైదరాబాద్ లో బ్యాలన్స్ షూటింగ్ ను పూర్తి చేస్తారట.
డైరెక్టర్ పూరి జగన్నాధ్, సునీల్, హీరో సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa