ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తుండగా దీనిపై అయితే పాన్ ఇండియా స్థాయిలో నెక్స్ట్ లెవెల్లో అంచనాలు నెలకొల్పుకున్నాయి. మరి ఈ సినిమాని అయితే అంచనాలకి తగ్గట్టుగా భారీ స్థాయిలోనే ఈ సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా..ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ పై పలు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ అయితే ఈ సినిమాకి గాను 300 కోట్లు పెడుతున్నారని తెలుస్తుంది. అలాగే ఈ లెక్క అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చని టాక్. మొత్తానికి అయితే సుకుమార్ అండ్ మేకర్స్ అయితే చాలా గ్రాండ్ స్కేల్ లోనే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa