బాలీవుడ్ హీరోయిన్ రియాచక్రవర్తి పై పోలీసులు అభియోగాలు దాఖలు చేశారు. గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆమె డ్రగ్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒప్పుకుంది. ఈ కేసులో తాజాగా ఆమెపై అభియోగాలు మోపుతూ నార్కోటిక్ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు రుజువైతే రియా చక్రవర్తికి 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానాను విధించే అవకాశం ఉంది. మరోవైపు ఆమెకు సినీ అవకాశాలు కూడా రావట్లేదు.