తాజాగా అలీతో సరదా టాక్ షోలో పాల్గొన్న వేణు తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. భారతీ రాజా సినిమాతో తాను వెండితెరకు పరిచయం కావాల్సిందని, కానీ అది కుదరలేదని చెప్పారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథని పూరి జగన్నాథ్ తనకే చెప్పాడని, కానీ కుదరలేదు అని అన్నారు. పూరి మరోసారి తన దగ్గరకు వచ్చి ‘దేశముదురు’ కథ చెప్పాడని, హీరో నువ్వేనంటూ చెప్పి చివరకు అల్లు అర్జున్‌తో తీశాడంటూ వేణు చెప్పాడు.