ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్ "మా నీళ్ల ట్యాంక్" ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 04:01 PM

అక్కినేని హీరో సుశాంత్ "మా నీళ్ల ట్యాంక్" తో ఓటిటి డిబట్ చేస్తున్న విషయం తెలిసిందే. జూలై 15వ తేదీ నుండి ప్రముఖ జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ నుండి ఇటీవలే ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల మెప్పును పొందింది. ఇందులో సుశాంత్ తెలంగాణ యాస మాట్లాడతారు. ఆయన భాష, యాటిట్యూడ్ ఈ సినిమాలో భిన్నంగా ప్రేక్షకులకు నచ్చేలా ఉంది.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ పై సుశాంత్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మా నీళ్ల ట్యాంక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగుతుందని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీని లక్ష్మి సౌజన్య డైరెక్ట్ చెయ్యగా, ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించారు. కొల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొల్లా ప్రవీణ్ ఈ సినిమాను నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com