కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం "కోబ్రా". క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 11న విడుదలబోతున్న ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు శ్రీనిధి భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసిందట. దాదాపు 6-7కోట్లు మేకర్స్ శ్రీనిధికి అందించారట. అంటే కేజీఎఫ్ చిత్రానికి రెట్టింపు మొత్తాన్ని ఈ సినిమా కోసం శ్రీనిధి అందుకుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతమైతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.