హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం రంగ రంగ వైభవంగా..ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తోంది. గిరీశయ్య దర్శకత్వంలో రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com