టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో, బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, రష్మిక మండన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "యానిమల్". ఏప్రిల్ లో ఈ మూవీ అధికారికంగా ప్రారంభమై, మనాలి లో కొంతమేర షూటింగును కూడా జరుపుకుంది. సందీప్ రెడ్డి వంగా తన తొలి సినిమా అర్జున్ రెడ్డి ని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించి బాలీవుడ్ లో బాగా పాపులరయ్యారు. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో సందీప్ ఏకంగా రణ్ బీర్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం కొట్టేసాడు.
పోతే, ఈ సినిమాలో రణ్ బీర్ తన రోల్ ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసాడు. షంషేరా లో ముసలి పాత్రలో కనిపించి అందరిని షాక్ కు గురి చేసిన రణ్ బీర్ ఈ సినిమాతో మరోసారి షాక్ ఇస్తానంటున్నాడు. ఎందుకంటే, ఈ సినిమాలో తను గ్రే క్యారెక్టర్ లో అంటే మంచి చెడులకు అతీతంగా ఉండే రోల్ లో నటించబోతున్నట్టు చెప్పాడు. అందుకే ఈ సినిమాకు యానిమల్ అనే యాప్ట్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2023 ఆగస్టు 11న యానిమల్ సినిమా విడుదలవబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa