రెజీనా కస్సాoడ్ర, అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజే అధికారికంగా ప్రకటింపబడింది. ప్రేమ - మోసం - పగ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఆసక్తికరమైన "మరీచిక" అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. పోస్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. జాతీయ అవార్డు గ్రహీత సతీష్ కాసెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. వన్ మోర్ హీరో మీడియా మరియు లక్ష్మీ భూపాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో భాగమవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa