ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ది గ్రే మాన్" ప్రీమియర్ షోకి పిల్లలతో హాజరైన ధనుష్ ..పిక్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 04:39 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన డిబట్ హాలీవుడ్ మూవీ "ది గ్రే మాన్ వరల్డ్ ప్రీమియర్ షోకి హాజరయ్యారు. ఈ కార్యక్రమం లాస్ ఏంజెల్స్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ధనుష్ తన పిల్లలను కూడా తీసుకురావడం విశేషం. యాత్ర, లింగ షోకు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ విషయాన్ని తెలుపుతూ, ధనుష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
అవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ వంటి వరల్డ్ టాప్ క్లాస్ సినిమాలను తెరకెక్కించిన రస్సో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్రిస్ ఇవాన్స్, ర్యాన్ గోస్లింగ్, అనా డే ఆర్మాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంగ్లిష్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తమిళం భాషలలో జూలై 15 నుండి సెలెక్టెడ్ ధియేటర్స్ లో , జూలై 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa