యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ డిబట్ మూవీ "జయం" సినిమాలోని "రాను రానంటూనే సిన్నదో" పాట ఎంత పాపులరయ్యిందో అందరికి తెలుసు. ఆ పాటలో నితిన్, హీరోయిన్ సదా పెయిర్ చూడముచ్చటగా ఉంటుంది. అప్పట్లో ఆ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. అంతేకాక, నితిన్ కెరీర్ లో ఆ పాట ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు.
తాజాగా ఆ పాటను నితిన్ కొత్త సినిమా "మాచర్ల నియోజకవర్గం" లోని రా రా రెడ్డి అనే ఐటెం పాటలో చిన్న బిట్ ను పెట్టారు. ఈ ఐటెం పాటలో తనతో కలిసి స్టెప్పులేసేందుకు ముందుగా నితిన్ హీరోయిన్ సదా ను అప్రోచ్ అయ్యారట. కానీ, ఆమె రిజెక్ట్ చెయ్యడంతో ఈ అవకాశం అంజలి వద్దకు వెళ్ళింది. నిజానికి, ఈ పాటలో అంజలి కాకుండా, సదా ఉండి ఉంటే, నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేది. 2002 లో విడుదలైన జయం సినిమాకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు నితిన్, సదా కలిసి ఈ పాట చేసి ఉంటే, ప్రేక్షకుల్లో ఈ పాట రీచ్ ఇంకా ఎక్కువగా ఉండి ఉండేది. అలానే రెస్పాన్స్ ఇప్పటి కంటే రెట్టింపు గా ఉండి ఉండేది. దీంతో చాలామంది సదా ఒక గోల్డెన్ అపర్చ్యునిటీని మిస్ చేసుకుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa