తనను చాలా వేదించారంటూ బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ షాకింగ్ నిజాలు చెప్పింది. 15 ఏళ్ల క్రితం విడుదలైన మర్డర్ మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఇండ్రస్టి సహా మీడియా వాళ్లు కూడా నన్ను మానసిక వేధింపులకు గురిచేశారని కామెంట్స్ చేసింది. ఇటీవ ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముద్దు సన్నివే శాలు, బికినీలో కనిపించడంపై ఎన్నో మాటలు అన్నా రని వాపోయింది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకునే అదే తరహా చిత్రం 'గెహ్రాహియా'లో నటిం చింది. దీనిని పోల్చుతూ ఇప్పుడు ఆమె చేసింది ఏమిటి.? దీపిక ఇప్పుడు ఏదైతే చేసిందో దాన్ని నేను అప్పట్లో చేశా. కాకపోతే అప్పట్లో ప్రేక్షకులు సంకుచిత మనస్తత్వంతో ఉండేవారు. ప్రస్తుతం వారి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి అని మల్లిక చెప్పుకో చ్చింది. మూడేళ్ల తర్వాత మల్లికా శెరావత్ మళ్లీ వెండి తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్కే సినిమా 22న రిలీజ్ కానుంది.