హీరోయిన్ రెజీనా ప్రెగ్నెంట్. ఈ స్వీట్ అబద్దాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. అసలు విషయం ఏంటంటే.. ? వరుస సిని మాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రెజీనా ఇటీవల ఓ వార్త పత్రికకు , ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పర్సనల్, సినిమాకు సంబం ధించిన ఆసక్తికర విషయాలు చెప్పింది. 14 ఏళ్ల వయసులోనే పని మొదలు పెట్టాను. 'కాండ నాల్ ముదల్' తమిళ సినిమాలో హీరోయిన్ చెల్లిగా చేశానని చెప్పింది. ఇక ఇష్టమైన స్వీట్ కోసం , ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పిన సందరాన్ని షేర్ చేసుకుంది. కర్ణా టకలో హిల్ స్టేషన్ దగ్గరలోని ఒక హోటల్ లో ఉన్నా. నాకు అక్కడ దొరికే 'మిస్తీ దోయి' అనే స్వీట్ చాలా ఇష్టం. సడెన్‌గా అది తినాల నిపించి బయటకు వచ్చా. రాత్రి 11 గంటలు అవుతోంది. అక్కడ షాప్స్ ఏమీ లేవు. ఒక షాప్ క్లోజ్ చేస్తుంటే అక్కడికి వెళ్లి అడిగాను. వాళ్లు ఇది క్లోజింగ్ టైం.. కుదరదన్నారు. ప్లీజ్ సర్! ప్రెగ్నెంటిని. అని అబద్దం చెప్పా. అలా చెప్పి ఆ స్వీట్ కొనుక్కుని తిన్నానని చెప్పుకొచ్చింది.