ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ (70) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. చెన్నైలోని తన అపార్ట్ మెంట్ లో ఆయన చనిపోయి కనిపించారు. ఆయన తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించారు. ప్రతాప్ నటి రాధికను 1985 లో పెళ్లి చేసుకున్నారు. 1986 లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత 1990లో అమలా సత్యనాథ్‌ను పెళ్లి చేసుకుని 2012 లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది.